Choose language to translate

ధనాకర్షణ/ Dhanakarshan

తంత్ర సాధన :
ఆర్ధిక అభివృద్ధి ప్రసాదించే ధనాకర్షణ తంత్ర ప్రయోగము. 
రవి పుష్య యోగం లో కాని, గురు పుష్య యోగం లో కాని ఈ తంత్రాన్ని చేయాలి. పుష్యమి నక్షత్రం వస్తే దానిని పుష్య యోగం అని అంటారు. రవివారము, గురువారాలలో పుష్యమి నక్షత్రం వచ్చినపుడు ఆచరించటం మంచిది.  ఆ రోజు ఉదయం "ఉత్తరేణి" మొక్క దగ్గరికి వెళ్లి, పూజించి, మీ అవసర నిమిత్తం చెట్టును భూమి నుండి తీసుకుంటున్నారని, మిమ్మల్ని క్షమించి అనుగ్రహించ వలసినదిగా ప్రార్దించాలి. ఆ తరువాత, చెట్టును తీసెసి, చెట్టు వేరును మాత్రం తీసుకుని రావాలి. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత, ముందుగా గోమూత్రంతో కాని, ఆవు పాలతో కాని శుభ్రం చేసి, ఆ తరువాత మంచి నీటితో శుభ్రపరచాలి.  ఆ తరువాత, వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి, ఆ వేరుకు షోడశోపచార పూజ అంటే, ధూపం అర్పించి, మట్టి ప్రమిదలలో నేతితో కాని, నువ్వుల నూనెతో కాని దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పుష్పాలతో పూజించి, ఏదైనా తియ్యటి పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా పూజ పూర్తి చేసాక ఎరుపు రంగు వస్త్రంలో వేరు తో పాటు, ఒక వక్క, , ఒక ఖర్జూరం, రెండు రూపాయి బిళ్ళలు వేసి, ఆ వస్త్రాన్ని మూట కట్టి, మరల ఒకసారి ధూపం చూపించి, ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో డబ్బును భద్రపరిచే చోట పెట్టాలి.  ఈ తంత్ర ప్రక్రియ చేయడం వలన మీకు మంచి ధన ప్రాప్తి, ధనాకర్షణ, ఆర్ధిక అభివృద్ధి లభిస్తుంది. 
శ్రీ మాత్రే నమః
-- సేకరణ, అవ్యజ్ (Shankar)

గమనిక : ఏ ప్రయోగాలైనా, ఉపాసనా విధానాలైనా ఇక్కడ సమాచారం కోసం మాత్రమే ఉంచబడినవి. సరైన గురువును వెతకడం ఆ గురువు వద్ద నుండి దీక్ష తీసుకొన్న తరువాత చేసే సాధనలకే సత్ఫలితాలు వచ్చును


No comments:

Post a Comment

Featured Articles

Happy shivratri

  🕉️ * మహా శివరాత్రి * శుభాకాంక్షలు. * ఓం నమః శివాయ * శివ శివ శివ యంటూ తలవవే ఓ మనసా..

Visiting places near by

  • Ankagudaru Gramadevata alaayam, Anaganivaripalem
  • Grama devatha alayam, Gullapalli.
  • Nadivelamma Gramadevatha Tirunalla, Rajavolu
  • Shikhareswara swamy, Nadimpalli
  • Sri Baalakoteswara swamy Alayam, Govada, Cherukupalli
  • Sri Durga Jeeveswara swamy aalayam, Rajavolu
  • Sri Gangambika sametha Anandeswara swamy, Gullapalli,
  • Sri Gokarneswara swamy temple, Gudavalli
  • Sri Prudhveswara swamy temple, Kanagala
  • Sri Ramalingeswara swamy temple, Arepalli, Cherukupalli
  • Sri Ramalingeswara swamy temple, Kavuru
  • Sri Someswara swamy temple, Ponnapalli, Cherukupalli.
  • Sri Subrahmanyeswara swamy alayam, Mopidevi, Repalle

Wiki guide about Visiting places

Search results

Our youtube channel