మహా శాబరి అఖండ కార్య సిద్ది ప్రయోగం
ఇది ఎటువంటి కార్యంలో అయినా విజయాన్ని సాధించి పెట్టే అత్యంత శక్తివంతమైన ప్రయోగం. కోర్టు కేసులు, కాంట్రాక్టులు, వ్యాపార విజయాలు, ఆస్తి విషయాలు, పదవులు, ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్లు వంటి ఎటువంటి కార్యంలో అయినా ఈ ప్రయోగాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి విజయాన్నిసాధించవచ్చు. ఇది "నవనాధ్" సాంప్రదాయానికి చెందిన "శాభరి తంత్రం" యొక్క అత్యంత సమర్ధవంతమైన మంత్ర ప్రయోగం. ఇది 41 రోజుల పాటు చేయవలసిన ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలు పూర్తయిన వెంటనే మొదలు పెట్టాలి. స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, నిత్య పూజలు చేసే చోట కానీ, ఏదైనా శుభ్రమైన చోట కానీ దీపాన్ని వెలిగించి, దీపం ముందు కూర్చుని, ఈ క్రింది మంత్రాన్ని జపించాలి.
మంత్రం:
" ఓం నమో మహా శాభరీ శక్తీ, మమ అరిష్ట నివారయ నివారయ,
మమ (అముక) కార్య సిద్ది, కురు కురు స్వాహ "
పై మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి 12 గంటలు పూర్తయిన వెంటనే రోజుకు 324 సార్లు (అంటే రోజుకు 3 మాలలు), 41 రోజుల పాటు జపించాలి. పై మంత్రంలో "అముక" ఇచ్చిన చోట, మీరు ఏ కార్యంలో అయితే విజయం సాధించాలనుకుంటున్నారో ఆ కార్యాన్నిచాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎంతో కష్టతరమైన కార్యాలను కూడా, ఈ ప్రయోగంతో సాధించవచ్చు.
-- సేకరణ, అవ్యజ్ (Shankar)
No comments:
Post a Comment