శ్రీ రాజశ్యామలా నవరాత్రులు (19-27 జనవరి,2026)
శ్రీ రాజశ్యామల నవరాత్రి శుభాకాంక్షలు. మాఘమాసంలో జరిగే నవరాత్రులు ఇవి. లలిత దేవికి ఇరువైపులా ఉన్న దేవతలలో కుడివైపు సహచరిణిగా శ్రీ శ్యామల / రాజ శ్యామల / రాజ మాతంగి / మాతంగి అని పిలువబడే ఈ దేవి ఉంటుంది. పుష్యమాసం అమావాస్య రాత్రి మొదలుకొని 9 రోజులు ఈ నవరాత్రులు జరుపబడతాయి.
పూర్తి తనువంతా ముదురు ఆకుపచ్చ వర్ణంలో, ఎనిమిది భుజాలతో వుండే ఈ దేవత సర్వజన వశంకరి గాను, మహా మంత్రిణిగా కూడా పిలువబడుతుంది. తంత్రశాస్త్రంలోని దశమహా విద్యలలో 9వ దేవత. శ్రీ విద్య ఉపాసనలో భాగంగా వుంటుంది.
ఈ దేవి ఉపాసన తాంత్రికంలో తీవ్రంగా మరియు గుప్తంగా ఉంది. ఈ ఉపాసన వలన రాజ భోగాలు, ఉన్నత గౌరవం మరియు రాజకీయంలో ఉన్నత లేదా ఆశించిన పదవులు రావటానికి ప్రయోగం లేదా ఉపాసన వలన కామ్యకర్మలు తీరుతాయి.
No comments:
Post a Comment